మళ్లీ ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీతోనే

రెండోసారి అదే సెంటిమెంట్

nirmala-sitharaman
nirmala-sitharaman

న్యూఢిల్లీ: మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్డడం రెండోసారి. గత బడ్జెట్ సభలో ప్రవేశ పెడుతున్న సమయంలో నిర్మల కొత్త సంప్రదాయాలకు తెరలేపారు. గతంలో ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతుల్ని బ్రీఫ్ కేసుల్లో తీసుకొస్తున్న సంప్రదాయానికి చెక్ పెట్టారు. కాగా గతేడాది తొలిసారిగా ఆమె ఎర్రటి బట్టలో బడ్జెట్ ప్రతుల్ని చుట్టి పార్లమెంట్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండోసారి కూడా నిర్మల సేమ్ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. ఈసారి కూడా పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రకటించేందుకు వచ్చిన ఆమె చేతిలో ఎర్రటి బట్టలో చుట్టిన బడ్జెట్ ప్రతులు కనిపించాయి. దీంతో నిర్మల ఈపారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సెంటిమెంట్‌ను బాగానే ఫాలో అవుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి మరి బడ్జెట్‌లో సామాన్యులకు ఎంతవరకు వరాలు ప్రకటిస్తుందో వేచి చూడాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/