మరి కాసేపట్లో డిమాండ్లతో కూడిన విలీనం ప్రకటన

OPS SWAMY
P SWAMY & OPS

చెన్నై: అన్నాడీఎంకెలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం వర్గాల విలీనం మరి కాసేపట్లో ప్రకటన వెలువడబోతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. పన్నీర్‌ సెల్వం వర్గం ప్రతిపాదించిన షరతులకు సీఎం పళనిస్వామి అంగీకరించడంతో విలీనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మోమోరియల్‌ను సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం. జయలలిత మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి రెండు వర్గాల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి, తన మంత్రివర్గ సభ్యులతో చర్చించగా, పన్నీర్‌ సెల్వం మాత్రం తన సన్నిహితులతో చర్చలు జరిపారు. జయలలిత మృతిపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్‌ గార్డెన్‌ నివాసాన్ని జయమోమోరియల్‌గా మార్చాలనే పన్నీర్‌ డిమాండ్లను ప్రభుత్వం అమోదించడంతో విలీనానికి రంగం సిద్ధమైతున్నట్లు సమాచారం.