మనిలాండరింగ్‌ కేసులో ఈడి ఎదుట రాబర్ట్‌ వాద్రా

robert vadra
robert vadra

న్యూఢిల్లీ: మనిలాండరింగ్‌ కేసులో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఎదుట విచారణకు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాధ్రా హాజరయ్యారు. కేసుకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. లండన్‌కు చెందిన స్థిరాస్తి వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ వాధ్రాపై ఈడి మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఐతే ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఢిల్లీ హైకోర్టు అందుకు అంగీకరించింది. ఫిబ్రవరి 16 వరకు వాద్రాను అరెస్టు చేయకూడదని, ఐతే కేసు విచారణ నిమిత్తం మాత్రం ఫిబ్రవరి 6న మాత్రం ఈడి ఎదుల హాజరు కావాలని కోర్టు వాద్రాకు సూచించింది.