మధ్యప్రదేశ్‌ సీఎం తీవ్ర వాఖ్యలు

shivraj singh chouhan
shivraj singh chouhan

మధ్యప్రదేశ్‌: రెవెన్యూ అధికారులపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల
క్రితం జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రెవెన్యూ కేసులను నెలలోపే విచారించని పక్షంలో
సంబంధిత అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ
ఆంశం ప్రస్తావనకు రావడం, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సభ్యులు కోరడంతో ఆయన ఈ విధంగా
స్పందించారు. చౌహాన్‌ అధికారంలోకి వచ్చి 12ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. నిర్దిష్ట
గడువులోగా రెవెన్యూ కేసులను పరిష్కరించకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అయితే దీనిపై ప్రతిపక్ష
పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. చౌహాన్‌ కలెక్టర్‌లపై కూడా అసభ్య పదజాలన్ని ఉపయోగించారని వారు మండిపడ్డారు.