మధ్యప్రదేశ్‌లో సిఎం కమల్‌నాథా లేక జ్యోతిరాథియానా?

jyotiraditya, kamal nath
jyotiraditya, kamal nath

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 15 సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌కు అధికారం దక్కింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్ర సిఎం బాధ్యతలు ఎవరు చేపట్టానున్నారు అనే విషయం సందిగ్ధంగా మారింది. ఆరాష్ట్రం నుండి సీనియర్‌ నేత కమలనాథ్‌, యువనేత జ్యోతిరాధిత్య సింథియాలు రేసులో ఉన్నట్లు సమాచారం వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌మ‌ల్‌నాథ్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళి చేప‌ట్టారు. కానీ సింథియా కూడా కీల‌క మ‌లుపుల‌కు ప్రాణం పోశారు. ఈ ఇద్ద‌రూ ఉన్నా.. తాను కూడా సీఎం రేసులోనే ఉన్న‌ట్లు మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ ఢంకా బ‌జాయించారు.