మధురై ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్ర‌మాదం

MADHURAI EXPRESS
MADHURAI EXPRESS

ముంబై: మహారాష్ట్రలోని ఖండాలా వద్ద మధురై ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఇవాళ తెల్లవారుఝామున 3.30 గంటలకు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీ తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన బోగీని తొలగించి రైలును అక్కడ్నించి అధికారులు పంపారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.