మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కొత్త ముఖాలు

Cabinet
Cabinet

ఛండీగఢ్: సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న పంజాబ్ మంత్రివ‌ర్గ‌ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారంనాడు అనుమ‌తి ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం మంత్రివర్గ విస్తరణ నిర్ణయాన్ని మీడియాకు అమరీందర్ తెలిపారు. ఇందుకు అధిష్ఠానం అనుమతి తెలిపిందని, తొమ్మిది మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ట్విట్టర్‌లో కొత్త మంత్రుల పేర్లను అమరీందర్ వెల్లడించారు. క్యాబినెట్‌లో కొత్తగా చేరుతున్న సుఖ్జీందర్ రాండ్వా, సుఖీందర్ సింగ్ సర్కారియా, విజయ్ ఇందర్ సింగ్లా, భరత్ భూషణ అషు, సుందర్ శ్యామ్ అరోరా, ఓపీ సోని, రాణా గుర్మిత్ సోథి, గుర్‌ప్రీత్ కాంగర్, బల్బీర్ సిద్ధులకు ఆయన అభినందలు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఛండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని అమరీందర్ చెప్పారు.