భారీ వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ ప్రదేశ్‌

HIMACHAL PRADESH
HIMACHAL PRADESH

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ లోని నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల వలన ఐదుగురు మరణించారని, వందలాదిమంది నిరాశ్రయులై సురక్షిత స్థలాలకు బయలు దేరినట్లు తెలుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన కొండ చరియలు విరిగిపడి, రోడ్లు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. మండి జిల్లాలో భూపాతం వలన ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు, సోలన్‌ జిల్లాలోని పర్వాను దగ్గర కౌశల్య నదిలో పడి ఒక బాలుడు కొట్టుకుపోయినట్లు, వారు తెలిపారు. సోలన్‌ జిల్లాలో కందఘాట్‌ లోని చక్లా గ్రామంలో ఐదుగురు వ్యక్తులు భూమిలో కూరుకుపోయినట్లు, ఒక వ్యక్తి మరణించినట్లు, ఆక్కడ సహాయ కార్యక్రమాలు జరగుతున్నట్లు రిపోర్టుల ద్వారా తెలిసింది. రాత్రంతా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌ జాం వలన రాZషంలోని రోడ్లన్నీ మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మండీలోని చండీఘర్‌-మనాలి నేషనల్‌ హైవే-21ని మూసివేశారని, అంతేగాక, సోలన్‌ జిల్లాలోని ‘చక్కి కా మోర్ఞ్‌ వద్ద చండీఘర్‌-సిమ్లా నేషనల్‌ హైవే-5దగ్గర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మండి-పఠాన్‌కోట్‌,చంబా-పఠాన్‌కోట్‌, సిమ్లా-నహన్‌ హైవేలన్నీ భూపాతం వలన మూసుకుపోయాయని తెలిసింది. కిన్నౌర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలలో భూమిలోని చీలికలు రోడ్లన్నీ ఎగుడుదిగుడుగా మారడంతో వాహనాలన్నీ నిలిపివేశారు. అదేవిధంగా కిన్నౌర్‌,సిమ్లా,చంబా,మండి,కులు, సిర్మౌర్‌ జిల్లాలలో ఈ వర్షాలకు రోడ్లన్నీ పాడవడంతో వాటిని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు సూచనలప్రకారం సిమ్లా, సోలన్‌, కులు, హమీర్‌పూర్‌, కంగ్రా, కిన్నౌర్‌, మండి జిల్లాలోని పాఠశాలలు, విద్యా సంస్థలన్నీ మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆ రాZషంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆధికారులు పేర్కొన్నారు. సిర్మౌర్‌ జిల్లాలోని పౌంటా సాహిబ్‌లో 239 మి.మీ., అత్యధిక వర్షపాతం నమోదు కాగ, హమీర్‌పూర్‌ జిల్లాలోని సుజాన్‌పూర్‌ తిరా పట్టణంలో 238మి.మీ., వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గత 24 గంటలలో మండిలోని నెహ్రి పట్టణంలో 235మి.మీ.,పాలంపూర్‌లో 212మి.మీ.,సిమ్లాలో 172మి,మీ., ధర్మశాలలో 142మి.మీ., కసౌలి 98మి.మీ., సోలన్‌ 94మి.మీ.,డల్హౌసీ 57మి.మీ., నమోదైనట్లు, మంగళవారం కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.