భారీ మెజారిటీతో స‌ర్కార్ ఏర్పాటుః కుమార‌స్వామి

HD Kumara swamy
HD Kumara swamy

కర్ణాటకలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిజిటల్ సాంకేతికత సాయంతో ఎన్జీ మైండ్ ఫ్రేమ్ అనే సంస్థ సర్వే నిర్వహించి, మేజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ తాకే అవకాశాలు లేవని, జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ గా మారనుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ సర్వేపై జేడీఎస్‌ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. తాను కింగ్‌మేకర్‌ కానని ప్రజలు మద్దతిస్తే కింగ్‌ అవుతానని వ్యాఖ్యానించారు. తాము సంపూర్ణ మెజారిటీతో సర్కారుని ఏర్పాటు చేస్తామన్న నమ్మకముందని అన్నారు. ఈ ఎన్నికల్లో 113 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తమకు 97-105 సీట్లు సులువుగానే వస్తాయని, మిగిలిన సీట్ల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అసలు హంగ్‌ ఏర్పడే ప్రసక్తే లేదని, తమ పార్టీయే మెజారిటీ సీట్లు సాధిస్తుందని, ఇక హంగ్‌ ఏర్పడితే తాము ఏ పార్టీకి మద్దతిస్తామన్న ప్రశ్నేలేదని అన్నారు.