భారీగా న‌కిలీ క‌రెన్సీ స్వాధీనం!

Fake Currency
Fake Currency

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బాండాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 7 లక్షల 96 వేల నకిలీ రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.