భారత్‌కు జపాన్‌ అతిపెద్ద పెట్టుబడిదారు: మోది

Modi1
Modi

అహ్మదాబాద్‌: భారత తొలి బుల్లెట్‌ రైలును భారత్‌-జపాన్‌ దేశాల ప్రధానులు కలిసి శంఖుస్థాపన గావించారు. అనంతరం
వీరిరువురూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అటు తర్వాత దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. భారత్‌కు జపాన్‌ మూడో అతిపెద్ద పెట్టుబడిదారని మోది అన్నారు. వాతావరణ మార్పులపైనా ఇరు దేశాలు కలిసి  పోరాడుతున్నాయి. ఇండియా, జపాన్‌ పోస్టుల ద్వారా జపాన్‌ వాసులు వారి దేశం నుంచే ఇక్కడి ఆహార పదార్ధాలను ఆర్డర్‌ చేసుకోవచ్చని ,అంతేగాక భారత్‌లో మరిన్ని జపాన్‌ రెస్టారెంట్లు రావాలని కోరుకుంటున్నట్లు మోది ఆశాభావం వ్యక్తం చేశారు.