బెదిరింపుల‌కు బయ‌ప‌డే వ్య‌క్తిని కాదుః క‌మ‌ల్

kamal haasan
kamal haasan

చెన్నైః నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని అయిన కూడా బ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని ప్రముఖ సినీన‌టుడు
క‌మ‌ల హాస‌న్ అన్నారు. తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. గురువారం ఆయ‌న
ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…. దేశంలో మార్పు అవసరమ‌ని ఆ మార్పు త‌న‌తోనే, తమిళనాడు నుంచే రావాలని తాను
నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రతి పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుందని, త‌న‌ జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల
నేతలను కలుసుకున్నాన‌ని, వారితో ఫొటోలు దిగానని , అయిన‌ప్ప‌టికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేద‌ని, త‌న‌
ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క‌ పార్టీ ఉన్నట్లుగా త‌న‌కు అనిపించ‌లేద‌ని చెప్పారు. శశికళను తొలగించడం,
అన్నాడీఎంకే పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని, దేశంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయిందని
‘ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, నాయ‌కులు ఓట్ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే
వారిని తొల‌గించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు కావాలి అని క‌మ‌ల్ అన్నారు.