బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్రునిగా పోటీ

prakashraj
prakashraj

సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ప్రకాష్‌రాజ్‌
హైదరాబాద్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌లోక్‌సభా నియోజకవర్గంనుంచి తాను స్వతంత్ర అభ్యర్ధిగాపోటీచేస్తున్నట్లుప్రకాష్‌రాజ్‌ స్పష్టంచేసారు. మరికొద్దిరోజుల్లోనే మీడియాతో పూర్తి వివరాలు చెపుతానని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్‌లో తనరాజకీయ అరంగేట్రంపై ఆయన సంక్షిప్త సమాచారం విడుదలచేసారు. త్వరలోనే తన ఎన్నికల ప్రణాలికలను సైతం వివరిస్తానన్నారు. దక్షిణాది చలనచిత్రరంగంలో విలక్షణ నటునిగా ఉన్న ప్రకాష్‌రాజ్‌ ప్రధాని నరేంద్రమోడీని, భారతీయ జనతాపార్టీపైనా తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లోనిలిచారు. ఈ ఏడాది ఒకటవ తేదీనే తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసారు. 53 ఏళ్ల ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ అబ్‌కీబార్‌ జనతాకీ సర్కార్‌ అంటూ ఆయన మేనెలలోనే ఎన్నికలకోసం తాను కార్యాలయం ప్రారంభిస్తానని అన్నారు. జాతీయ అవార్డు విజేత అయిన ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ ప్రకటనచేసారు. కొత్త ప్రారంభం, మరింత బాధ్యత, మీ మద్దతుతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్ధిగాపోటీచేస్తున్నానని వెల్లడించారు. జర్నలిస్టు స్నేహితురాలు గౌరి లంకేష్‌ హత్యపై ఆయన తరచూప్రభ్తువ తీరునుసైతం దనుమాడారు. 2017 సెప్టెంబరులోనే తన నివాసం వద్ద గౌరీ లంకేష్‌ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని విమర్శిస్తుండటం వల్లనే తనకు బాలివుడ్‌ నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేసారని ఆయన అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ శుక్రవారం ప్రకాష్‌రాజ్‌కు తన మద్దతును ప్రకటించింది. ప్రకాష్‌రాజ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా వెల్లడించారు. దక్షిణాదిలో రజనీకాంత్‌, కమల్‌హసన్‌ల తర్వాత రాజకీయాల్లోనికి అరంగేట్రంచేస్తున్న మూడో నటుడుగా ప్రకాష్‌ రాజ్‌ నిలిచారు.