బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమే

shivpal yadav
shivpal yadav

సమాజ్‌వాది తిరుగుబాటునేత శివ్‌పాల్‌యాదవ్‌
లక్నో: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీతో తాము పొత్తుకు సిద్ధమేనని సమాజ్‌వాదిపార్టీ తిరుగుబాటునేత శివ్‌పాల్‌యాదవ్‌పేర్కొన్నారు. ఇటీవలే యాదవ్‌ ప్రగతిశీల్‌సమాజ్‌వాదిపార్టీ (లోహియా)ను స్థాపించారు. కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి బిజెపిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిపిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో తమపార్టీ ఉనికి బలంగా ఉందని,పార్టీ అన్ని స్థానాలకు బిజెపికి వ్యతిరేకంగాపోటీచేస్తుందని, బిజెపిని ఓడిస్తుందని, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు అవగాహనకు వచ్చి బిజెపికి వ్యతిరేకంగా హస్తంతోచేతులు కలుపుతామని వెల్లడించారు. బరేలిలో పర్యటించిన శివ్‌పాల్‌యాదవ్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు మేనమామఅవుతారు. పార్టీలనేతలు బిజెపిని ఓడించదలిచే నేతలందరూ తమ పార్టీని సంప్రదించాలని ఐక్యవేదికపైకి రావాలని ఆయన పేర్కొన్నారు. ఇక హనుమంతునిపై చెలరేగుతున్న వివాదంపై తిరుగుబాటునేత మాట్లాడుతూ ఆయన ఒక దేవుడు. ఎవరు ఆయన్ను ఒకకులానికి పరిమితం చేసినా వారి హ్రస్వదృష్టిని స్పష్టంచేస్తుందని అన్నారు. వివాదంలో ఉన్న స్థలంలో రామమందిర నిర్మాణం జరగకూడదని సరయూ నది చుట్టూ విశాలమైన స్థలాలున్నాయని, అక్కడ దేవాలయం నిర్మిస్తే తాను కూడా కొంత కేటాయిస్తానని అన్నారు. సుప్రీంకోర్టు ఈ వివాదంపై తన వైఖరిని మార్చుకోకూడదనే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రామమందిర స్థలవివాదం కేసును వచ్చే జనవరి 4వ తేదీనుంచి విచారణచేస్తామని వెల్లడించారు.