బస్సు లోయలో పడి, 13 మంది మృతి

Bus Accident
Bus Accident

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని తోటం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్మోరా జిల్లా తోటం సమీపంలోని రామ్‌నగర్‌-అల్మోరా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లింది. బాధితులను రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఉత్తరాఖండ్‌ సియం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు.