బళ్లారిలో 144 సెక్షన్‌ అమలు

144 Section
144 Section

బళ్లారి: కార్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాఉ బిజెపికి సానుకూలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. మరోవైపు గాలి సోదరుల నియోజకవర్గమైనా బళ్లారి వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 144 విధించినట్లు జిల్లా ఎస్పీ రంగరాజన్‌ తెలిపారు. బళ్లారి జిల్లాలో మొత్తం 9నియోజక వర్గాల్లో 19లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 74.13శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.