బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్టు లేదు

Shashi Tharoor
Shashi Tharoor

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు శశిథరూర్‌ మాట్లాడతు బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్టు లేదని ఆయన అన్నారు. ఊరించి ఉసూరుమనిపించిందని విమర్శించారు. మధ్యతరగతి వారికి ఇచ్చిన ఆదాయం పన్ను మినహాయింపు మాత్రమే ఊరటనిస్తుదన్నారు. రైతు బంధు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే రూ.6,000 ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. నెలసరి రూ.500 ఏవిధంగా రైతులకు మేలు చేస్తుందో చెప్పాలన్నారు. అంత చిన్న మొత్తంతో రైతు గౌరవప్రదంగా బతకడం సాధ్యమేనా అని నిలదీశారు. శశిథరూర్‌