ఫోర్జ‌రీ కేసులో కోర్టుకు అమ‌లాపాల్‌

Amala paul
Amala paul

ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవ‌డానికి సినీ న‌టి అమలా పాల్‌ కేరళ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఆమె త‌న‌ కారుకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో కేరళ హైకోర్టులో కేసును ఎదుర్కుంటోంది. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన అమ‌లాపాల్ తాను కొన్న‌ కోటి రూపాయలు విలువైన బెంజ్‌ కారుకు సంబంధించిన డాక్యుమెంట్లలో త‌ప్పుడు వివ‌రాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న‌ది కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అని పేర్కొంటూ అడ్రెస్‌ వివరాలు ఫోర్జరీ చేసిందని కేరళ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వద్ద అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సంతోష్‌ కుమార్‌ కేసు వేశారు. అమ‌లాపాల్ చేసిన ఈ ప‌నితో కేరళ రాష్ట్రానికి నష్టం వ‌చ్చింద‌ని అన్నారు. అయితే, తాను గ‌తంలో పుదుచ్చేరిలోనే నివసించేదాన్నని అమలాపాల్ చెప్పింది. తనకు అక్క‌డ‌ సొంత ఇల్లు ఉంద‌ని ఇప్పుడు దానిని అద్దెకు ఇచ్చానని పేర్కొంది.