ప‌రీక్ష‌ల్లో మాల్ ప్రాక్టీస్‌.. డిబార్‌

Dibar
Dibar

పాట్నా : పన్నెండో తరగతి పరీక్షల్లో కాపీ కొట్టడం, మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 1000 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన పరీక్షలు.. శుక్రవారంతో ముగిశాయి. పరీక్షల్లో కాపీయింగ్‌కు సహకరించిన, 25 మంది నకిలీ ఇన్విజిలేటర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బీహార్ వ్యాప్తంగా 1,384 పరీక్షా కేంద్రాల్లో 112,07,986 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.