ప్రార్ధ‌న‌లో వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి

court
court

తమిళనాడులోని స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వందేమాతరం గీతాన్ని ఆలాపించడం తప్పని సరి మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పంది. స్కూళ్లలో వారానికి ఒకసారి సోమవారం లేదా శుక్రవారం నాడు వందేమాతరం గీతాన్ని ఆలాపించాలని, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో కనీసం నెలకు ఒకసారి వందేమాతరం ఆలాపించాలని జస్టిస్‌ ఎంవి మురళీధరన్‌ ఆదేశాలు జారీ చేశారు. బెంగాలీలో కాని, సంస్కృతంలో కాని ఆ గీతాన్ని ఆలాపించడం కష్టమని ప్రజలు భావించిన పక్షంలో దీనిని తమిళంలోకి అనువదించి ఆలాపించవచ్చునని న్యాయమూర్తి పేర్కొన్నారు.