ప్రారంభమైన ‘తానా’ చైతన్య స్రవంతి కార్యక్రమాలు

TANA
TANA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండేళ్లకోసారి తెలుగు రాష్ట్రలో నిర్వహించే చైతన్య స్రవంతి కార్యక్రమాలు ఈసంవత్సరం డిసెంబర్‌ 23 నుండి జనవరి 12 వరకు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈకార్యక్రమాల్లో రైతుకోసం అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తానా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులు, రసాయనవాడక నివారణ పద్ధతులు తెలపడంతో పాటు, పిచికారి మందుల వినియోగంలో రైతులకు ఉపయోగపడే రక్షణ సామాగ్రి. భూమి పరీక్షా పరికరాల పంపిణీ వంటివి ఈ రైతుకోసం కార్యక్రమాల్లో పంపిణీ చేయనున్నారు.