ప్రభుత్వరంగ బ్యాంకుల లాభదాయకతపై మంత్రి ధీమా

piyush goel
piyush goel

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మరింత లాభదాయకంగా ఉంటుందని రానున్న రోజుల్లో బ్యాంకులు రికవరీ అవుతాయని ఆర్ధిక మంత్ర ఇపియూష్‌ గోయల్‌ వెల్లడించారు. ముందురోజు ప్రభుత్వరంగ బ్యాంకర్లందరితోను సమీక్ష నిరవ్హఇంచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు ఎన్‌సిఎల్‌టికి నివేదించిన కేసులపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు వాటన్నింటినీ ఆర్ధికమంత్రి ముందు ప్రస్తావించారు. అంతేకాకుండా ఎంఎస్‌ఎంఇ రంగానికి, ఎన్‌బిఎఫ్‌సి రంగానికి కేటాయింపుల పెంపు, వాటినుంచి ఎదురవుతున్న రానిబాకీలు వంటి వాటిపై ఎక్కువ దృష్టిసారించారు. ఇటీవలికాలంఓల ఈరెండు రంగాలకు రుణపరపతి అందకపోవడంపై ఎంతో నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్‌బిఔ, ఆర్ధికశాఖమధ్య పెద్ద అంతర్యుద్ధమే నడిచిందని చెప్పాలి. సమావేశంలో పాల్గొన్న ఆర్‌బిఐ గవర్నర్‌ బ్యాంకులు కేటాయింపులు పెంచుకోవాలని, రానిబాకీల రికవరీకి మరింతగా చర్యలు తీసుకోవాలని కోరారు. రుణాల రద్దులపరవం, సామర్ధ్యం పెంపు, టెక్నాలజీ వినియోగం, బ్యాంకింగ్‌రంగంలో సుపరిపాలన వంటి వాటిని విస్తృతంగా అమలుచేయాలనికోరారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంఎస్‌ఎంఇ రుణపరపతిని పెంచాలి. రుణం మంజూరుకు కాలపరిమతినితగ్గించాలి. పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. బ్యాంకర్లు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ముద్రాచయోజన వంటి వాటి రుణాలు మంజూరుకు ప్రత్యేక కేటాయింపులుండాలి. అందరికీ పక్కా ఇళ్లు 2022 నినాదానికి అనుగుణంగా హౌసింగ్‌ రునాలుపెంచాలనినిర్ణయించారు. పనితీరు మెరుగుపరిచేందుకు బ్యాంకులను తక్షణ సర్దుబాటు కార్యాచరణ(పిసిఎ)నుంచి మినహాయించి సడలింపులివ్వాలని కొందరు కోరారు.