ప్రతి ఆడబిడ్డా నిర్భయంగా జీవిస్తుంది

 

venkaiahnaidu, Vice President of India
venkaiahnaidu, Vice President of India

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించారు. నవ భారతదేశ నిర్మాణం దిశగా ఎన్టీయే ప్రభ్వుతం ప్రయాణం ప్రారంభించిందని ఆయన అన్నారు. 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ నూతన భారతదేశంలో… ప్రతి ఒక్క పౌరుడు ప్రాథమిక సౌకర్యాలు అందుకుంటాడు. ప్రతి పౌరుడికి తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రతి పిల్లాడికీ ఎలాంటి లోటు లేకుండా జీవన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రతి ఆడబిడ్డా నిర్భయంగా జీవిస్తుంది. ప్రతి ఒక్కరికీ గౌరవంగా న్యాయం జరుగుతుంది. యావత్ ప్రపంచమే గౌరవించేలా నవ భారతదేశం సగర్వంగా నిలబడుతుంది. అని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.