పోలీసుల అదుపులో కనిమొళి

Kanimozhi
Kanimozhi

చెన్నై: తూత్తుకూడిలో పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ డిఎంకెతో పాటు ప్రతిపక్షాలు నేడు తమిళనాడులో భారీ ఎత్తున చేపట్టాయి. చెన్పైలో ఎగ్మోర్‌లో ఆందోళన నిర్వహిస్తున్న డిఎంకె ఎంపీ కనిమొళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌ సందర్భంగా కనిమొళి మీడియాతో మాట్లాడుతూ పళనిస్వామి ప్రభుత్వం ప్రజలపై దమనకాండను చేపడుతోంది. తూత్తుకుడి మారణకాండకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. స్టెరిలైట్‌ సిఈవో తమ ఫ్యాక్టరీ మూసేయ్యమని చెబుతున్నారు. నేడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కనిమొళితో పాటు విదుతలై చిరుతైగల్‌ కచ్చి(వీఎస్‌కె) నేత తిరుమవళవన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టెరిలైట్‌ రాగి ఫ్యాక్టరీని విస్తరించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం విదితమే. దీంతో 9మంది అదే రోజు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు చికిత్స పొందులూ మృతి చెందారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగరంలో 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ముందు జాగ్రత్తగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారంగా ఇప్పటికే స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి విద్యుత్‌ నిలిపివేశారు.