పొంగల్‌ కానుకల సమస్యలో కిరణ్‌ బేడీ

Kiranbedi
Kiranbedi

చెన్నై: పుదుచ్చేరి ప్రజలకు పొంగల్‌ కానుక పంపిణికి సంబంధించి సిఎం నారాయణస్వామి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఆరోపించారు. తమిళనాడులో పొంగల్‌ కానకగా 14 సరుకులతో కుడిన ప్రభుత్వ రేషన్‌ను అన్నాడీఎంకే దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుంది. అయితే వారిలాగే పుదుచ్చేరిలో కూడా సరుకుల పంపిణి చేసేందుకు అనుమతిచాల్సిదిగా గవర్నకు సిఎం ఫైలు పంపించారు. ఈ పథకానికి రూ.5 కోట్ల నిధులు అవసరమని ఆ ఫైలులో సూచించారు. పొంగల్‌కు ఇంకా 14 రోజులే ఉన్న నేపథ్యంలో పొంగల్‌ సరుకుల కొనుగోలుకు గవర్నర్‌ త్వరలోనే అనుమతులు జారీ చేస్తారని సీఎం అభిప్రా యపడ్డారు. అయితే, పుదుచ్చేరి ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని కారణం చూపిన గవర్నర్‌ కిరణ్‌ బేడీ పొంగల్‌ సరుకుల కొనుగోలుకు నిధులు ఎక్కడున్నాయని  ఆమె అన్నారు.