పిఎఫ్‌ వడ్డీరేటుకు ప్రభుత్వ అనుమతి

EPFO
EPFO

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్యనిధి(పిఎఫ్‌)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అనుమతి లభించింది. వడ్డీరేటు 8.55శాతంగా నిర్ణయించిన ఈపిఎఫ్‌లో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. కర్ణాటక మేనిఫెస్టోలో అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కేంద్ర ఆర్థికశాఖ అధికారికి ప్రకటన వెలువరించింది. దీంతో పిఎఫ్‌ ఖాతాలు సుమారు 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ వారంలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కానుంది. గత ఐదేళ్ల ఇదే అతి తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం. 2015-16లో 8.88శాతం ఉన్న వడ్డీరేటు 2016-17లో 8.65శాతం, 2017-18లో 8.55శాతానికి తగ్గించారు. ఐతే ఆ వడ్డీరేటు మరింత తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ పట్టుబడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ, ఆఖరికి ఈపిఎఫ్‌లో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.