పాలన వ్యవహారాల్లో బేడీ మితిమీరిన జోక్యం

Kiran bedi
Kiran bedi

పుదుచ్చేరి సిఎం నారాయణస్వామి నిరసన
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వప్రతినిధులు పాలనా వ్యవహారాల్లో గవర్నర్‌ కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని తీవ్రనిరసన వ్యక్తంచేసారు. గవర్నర్‌ కార్యాలయం రాజ్‌నివాస్‌ ఎదుట ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ ప్రతినిదులు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అడ్డుతగులుతున్నారని, ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని ఆమె అవమానిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులునిరసనప్రదర్శన నిర్వమించారు. మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రులు, కాంగ్రెస్‌, డిఎంకె, ఎమ్మెల్యేలు మొత్తం ఈనిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. నారాయణస్వామి నల్లచొక్కాను ధరించి నల్లటిపంచెనే కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. గవర్నర్‌ కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా శాంతియుత ఆందోలన నిర్వహిస్తామని, ప్రభుత్వం రోజువారి కార్యకలాపాల్లోకూడా బేడీ జోక్యం మితిమీరిపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికైన ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాన్ని అవమానించి సంక్షేమపథకాలను అడ్డుకుంటున్నారని, ఉచిత బియ్యం, పొంగల్‌ బోనస్‌ల జారీని నిలిపివేసారని, కార్పొరేషన్లకు గ్రాంట్‌ఇ న్‌ ఎయిడ్‌ను నిర్లక్ష్యంచేస్తున్నారని, సొసైటీలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ప్రైవేటు స్కూళ్లకు వేతనాలు, పింఛన్‌సైతం పంపిణీచేయలేనిపరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఉద్యోగులు,రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లింపులు చేయకుండా అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. 39 డిమాండ్లతోకూడిన పత్రాన్ని సీఎం గవర్నర్‌ బేడీకి పంపించారు. శాంతియుత ప్రదర్శన నిర్వహించినా లెఫ్టినెంట్‌గవర్నర్‌నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిర్బంధంగా హెల్మెట్‌ నిబందననుఅమలుచేయడాన్ని సీఎం వ్యతిరేకించారు. కేంద్రపాలితప్రాంతంలో ఆమె చర్యలు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనప్రభుత్వాలను అవమానిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. డిఆర్‌డిఎను అంతకుముందు సందర్శించిన గవర్నర్‌ కిరణ్‌బేడీ హెల్మెట్ల ధారణను తప్పనిసరిచేసారు. ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలు తమ నిరసనను వ్యక్తంచేస్తూ హెల్మెట్లను విరగ్గొట్టారు. అంతకుముందురోజే కిరణ్‌బేడీ కేంద్రప్రభుత్వానికి లేఖరాస్తూ పుదుచ్చేరిలో విధిగా హెల్మెట్లు ధరించాలని ముఖ్యమంత్రి నారాయణస్వామికి తెలియజేయాలని పేర్కొన్నారు.