పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి

AAP PARTY
AAP PARTY

న్యూఢిల్లీ:గ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆప్ నేత సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని అన్నారు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఈ బిల్లును ఆమోదించాలని, లేనిపక్షంలో కోర్టు అడ్డుకుంటుందని అభిప్రాయపడ్డారు.