పార్లమెంటు సమావేశాల్లో 25 బిలు

 

 

PARLIAMENT
PARLIAMENT

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెబీ లెన్నికల ఫలితాలు ఈ సారి జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర బిందువు అవుతాయి.ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పరంగా ప్రధాని నరేంద్రమోడీతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇతరప్రముఖులు సుమారు రెండునెలలపాటు అదే ప్రచారంలోనిమగ్నం అయ్యారు. ఇక శీతాకాల సమావేశాలు ఈనెల 15వ తేదీనుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటిరోజు సజావుగానే సాగి ఆ తర్వాత సోమవారం వరకూ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ సమావేశాల్లో మొత్తం 25 పెండింగ్‌ బిల్లులనుప్రవేశపెడుతోంది. వీటిలో కొత్తవి 14 వరకూ ఉన్నాయి. ముస్లిం మహిళలకు ట్రిపుల్‌ తలాక్‌చెపితే వారికి మనోవర్తి కూడా అడిగే హక్కును కల్పిస్తూరూపొందించిన బిల్లుఈ సమావేశాల్లోనే చర్చకు వస్తోంది. ఎన్నికల కారణంగా నెలరోజులపాటు జాప్యం జరిగిన శీతాకాల సమావేశాలు సహజంగానేకొన్ని రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈసారి 14 పనిదినాల్లో మాత్రమే జరుగుతాయని అంచనా. గత శీతాకాలసమావేశాలు 21రోజులపాటు జరిగాయి. అయితేప్రభుత్వం మాత్రం తన చట్టపరమైన బిల్లులు ఈ సారి ఆమోదం పొందుతాయని అంచనా. ఆర్ధికవ్యవస్థ, వ్యవసాయరంగ అలజడి, జిఎస్‌టి అమలు వంటివాటితోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం వంటి అంశాలనుప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఎక్కువ భాగం ఎన్నికల ఫలితాలే ఉంటాయి. గుజరాత్‌ఎన్నికల ఫలితాలపైనే కాంగ్రెస్‌,బిజెపిలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు మరింత కలిసి వస్తుందని అంచనా. ప్రధాన మంత్రిమోడీ, బిజెపి అమిత్‌షాల స్వరాష్ట్రంలో బిజెపి ప్రచారం ఆశించిన స్థాయిలో కలిసిరాలేదన్న అంచనాలు జోరందుకున్నాయి. అయితే లోక్‌సభలో చిక్కులు ఎదురైనా ఈ సారి రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కావడంతో కీలక చర్చలకు ప్రతిష్టంభన ఉండకపోవచ్చని చెపుతున్నారు. అయితే ఇటీవల సస్పెన్షన్‌కు గురైన శరద్‌యాదవ్‌, ఆలి అన్వర్‌ల అంశకూడా తీవ్రస్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.