పార్టీ పొత్తులు అన‌వ‌స‌రంః మాజీ సీఎం అఖిలేష్‌

UPO CM Akhilesh Yadav
Akhilesh yadav

లఖ్‌నవూ: పొత్తుల గురించి మాట్లడడమే దండగ అని, అది సమయం వృథా చేసుకునే పని అని ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల విషయంలో అఖిలేశ్‌ను పొత్తుల గురించి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చారు. పొత్తుల గురించి మాట్లాడడం సమయం వృథా పనిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికలకు పొత్తుల గురించి ఆలోచించకుండా ఎస్పీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికలు చాలా కీలకమైనవని, యూపీ ఫలితాలు దేశానికి సందేశమిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీతోనూ పొత్తు గురించి ఆలోచించట్లేదని అన్నారు. దీని వల్ల చాలా సమయం వృథా అవుతోందని, గందరగోళం(సీట్ల విషయంలో) ఏర్పడుతోందని అన్నారు. అయితే భావసారుప్యత కలిగిన పార్టీలతో స్నేహానికి ముందుంటానని అన్నారు. అఖిలేశ్‌ వ్యాఖ్యలపై భాజపా నేత అమిత్‌ మాల్వియా స్పందించారు. 2019 ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని అన్నారు.