పాన్‌-ఆధార్ లింక్ గ‌డువు పెంచిన ప్ర‌భుత్వం

aadhar-pan link
aadhar-pan link

పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ తో లింక్ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు యూఐడీఏఐ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువును 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ గడువును కేంద్రం పొడిగించడం ఇది మూడోసారి. తొలుత 2017 జులై 31వ తేదీని గడువుగా ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని ఆగస్టు 31 వరకు, అనంతరం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి గడువును పొడిగించింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఇబ్బుందులు తలెత్తడంతో, ప్రజల సౌకర్యార్థం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద 33 కోట్ల మంది పాన్ ఖాతాదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 13.28 కోట్ల మంది తమ పాన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకున్నారు. అయితే ఇది వరకు ఆధార్ కార్డు లేనివారికే ఇది వర్తిస్తుంది.