పాట్నాలో పెద్ద నోట్ల కొర‌త‌!

Rs.500
Rs.500

పట్నా: ఆర్‌బీఐ నుంచి పెద్ద నోట్ల సరఫరా ఆగిపోవడంతో బిహార్‌ రాజధాని పట్నా ప్ర‌జ‌లు పెద్ద నోట్ల కొరతతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్నాలోని పలు ఏటీఎంలకు రూ.500, రూ.2000 నోట్ల సరఫరా నిలిచిపోయింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన దాదాపు 300 ఏటీఎంలకు పెద్ద నోట్ల సప్లై ఆగిపోవడంతో అక్కడి ప్రజలకు క‌ష్టాలు ప్రారంభ‌మయ్యాయి. ఈ ఘటనతో మరోసారి పెద్ద నోట్లు రద్దైనట్లుగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌బీఐతో మాట్లాడే యోచనలో ఉన్నట్లు ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ సయ్యద్‌ ముజఫర్‌ వెల్లడించారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మరోపక్క గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో పెద్ద నోట్లను అక్కడికి తరలించడంతోనే ఇక్కడ నిలిచిపోయినట్లు ఆర్జేడీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్కడ పెద్దనోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.