పశ్చిమ్‌బంగానులో ప్రభావం చూపుతున్న తిత్లీ తుఫాను!

titli
titli

న్యూఢిల్లీ : ఒడిశా సహా ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన తిత్లీ తుపాను ఇప్పుడు పశ్చిమ్‌బంగా‌ను తాకింది. దీంతోపాటు అసోం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరం, త్రిపురలోనూ తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఒడిశాలో బలహీనపడ్డ తుపాను ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ్‌బంగా‌లో ప్రభావం చూపుతుందని తెలిపింది. దీనివల్ల బంగాల్‌, అసోం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఒడిశా, బంగాల్‌ తీర ప్రాంతాల్లో సముద్రం తీవ్రమైన కల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది.