పదిరోజుల్లోపు రైతు రుణమాఫీ చేస్తాం

bhupesh bhagel
bhupesh bhagel

రాయపూర్‌: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన రైతు రుణాల మాఫీ హామిని పది రోజుల్లో అములు చేయనున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ కొత్త సిఎం భూసేష్‌ బాగెల్‌ ప్రకటించారు. రైతులు రుణమాఫీ చేయడం, క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.1700 నుంచి రూ.2.500కు పెంచేందుకు ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వీటితో పాటు 2013 మే 25న జరిగిన జీరం ఘాటి నక్సల్ దాడి ఘటనపై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు