నౌషేరా సెక్టార్‌లో కాల్పులతో తెగబడిన పాకిస్తాన్‌

121
LOC

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ మరోసారి తెగబడింది. అక్నోర్‌, నౌషేరా సెక్టార్లలోని వాస్తవాధీనరేఖవెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. సరిహద్దు భద్రతాదళం, సైనికదళాలు కాల్పులను తీవ్రంగాప్రతిఘటించాయి. 72 గంటలతర్వాత పాకిస్తానీ రేంజర్ల కాల్పులు ఆదివారం ఉదయం 5.30 గంటలకు నిలిపివేసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌మళ్లీ భారీ కాల్పులతోను, మోర్టార్లతోను వాస్తవాధీనరేఖవెంబడి ఉన్న భవాని, కరాలి, సైద్‌,నంబ్‌, షెర్‌మర్కారీ ప్రాంతాల్లో భారీ కాల్పులకు తెగబడిందని రాజౌరి జిల్లా కలెక్టర్‌ షహీద్‌ఇక్భాల్‌ చౌదరి వెల్లడించారు. కాల్పుల్లో సిపాయి సికెరా§్‌ు తీవ్రంగా గాయపడ్డాడు. మిలిటరీ ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఆతని మృతితో అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఐదుజిల్లాల్లో జమ్ము, ఖతువా, సాంబా, పూంఛ్‌, రాజౌరి జిల్లాల్లో మొత్తం 11 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు అమాయక పౌరులు కాగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉన్నారు. కేంద్రహోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రత్యర్ధులపై భారత్‌ సైన్యం విజృంభించిందని, తన సరిహద్దులోనలు, విదేశీ ప్రాంతంలో కూడా తీవ్రంగాప్రతిఘటించిందని తెలిపారు. వారం రోజులక్రితమే భారత సైన్యం పాకిస్తాన్‌ దళాలపై దాడులు నిర్వహించి ప్రతీకార చర్యగా ఏడుగురు సైనికులను హతమార్చింది. మరో నలుగురు గాయపరిచిన సంఘటన జరిగిన వారం రోజులతర్వాతకేంద్రహోంమంత్రి రాజౌరి సంఘటనలపైస్పందించారు.