నేషనల్‌ హెరాల్డ్‌ కేసు 22 కు వాయిదా

delhi high court
delhi high court

న్యూఢిల్లీ: ఢిµల్లీ లోని హెరాల్డ్‌ హౌస్‌ ను సీల్‌ వేయరాదని ఢిల్లీ హైకోర్టు సంబంధిత వర్గాలకు తెలిపింది. కాగా,హెరాల్డ్‌ హౌస్‌ ను ఖాళీ చేయాలనే ఉత్తర్వులపై అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఎజెఎల్‌) వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే ఈ అంశంలో కోర్టు ఆర్డర్‌ వచ్చే వరకు హెరాల్డ్‌ హౌస్‌ ను సీల్‌ వేయరని కోర్టు తెలిపింది. కాగా హెరాల్డ్‌ హౌస్‌ ఖాలీ చేయాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై ఎజెఎల్‌ కోర్టులో సవాల్‌ చేసింది.గురువారం ఈ అంశాన్ని విచారించిన హైకోర్టు నవంబరు 22 కు వాయిదా వేసింది. అంత వరకు ఆ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నారని కోర్టు తెలిపింది.అయితే ఢిల్లీ లోని ఐటిఒ దగ్గర ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ లో హెరాల్డ్‌ హౌస్‌ ను నిర్వహిస్తున్న ప్రదేశానికి 56 ఏళ్ల లీజు గడువు పూర్తయిందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని అక్టోబరు 30 న పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సంబంధిత పబ్లిషర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే ఈ అంశాన్ని విచారించిన హైకోర్టు ఈ కేసు సంబంధించిన ఫైల్‌, రిజిZసీ నుంచి తమకు చేరలేదని,అంతేగాక ఈ కేసును ఇప్పటికిప్పుడు విచారించలేమని కోర్టు పేర్కొంది.