నేడు మన్మోహన్‌ రాజ్యసభకు నామినేషన్‌

Manmohan Singh
Manmohan Singh

జైపూర్: రాజ్యసభ ఉప ఎన్నికలకు రాజస్థాన్ నుంచి పోటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన తన నామినేషన్ పత్రాల రెండు సెట్లను దాఖలు చేస్తారని రాజస్థాన్ డిప్యూటీ సిఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్‌ పైలట్ చెప్పారు. బిజెపి ఎంపి మదన్‌లాల్ సైని జూన్‌లో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు 10 సీట్లు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు ఉన్నాయి. వందమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఉన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ (ఆర్‌ఎల్‌డి) కు ఒకసీటు, బిజెపికి 72, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)కి 6, భారతీయ ట్రైబల్ పార్టీ (బిటిపి), సిపిఎం, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) లకు తలో రెండు సీట్లు ఉన్నాయి.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/