నీట్‌ ఫలితాలు విడుదల

NEET RESULTS
NEET RESULTS

ఢిల్లీ: వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకోసం నిర్వహించిన జాతీయ ప్రవేశార్హత పరీక్ష(నీట్‌)-2018 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. మొదట మధ్యాహ్నాం 2గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించినప్పటికీ అంతకన్నా ముందు కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి(సిబిఎస్‌ఈ) ఫలితాలను వెల్లడించింది. వెబ్‌సైట్‌కి లాగిన్‌ అయి విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మే 6తేదీన నిర్వహించారు. కాగా, పలు భాషల్లో ప్రశ్నాపత్రం ఒకే మాదిరిగా లేదని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఇంగ్లీష్‌, తమిళ ప్రశ్నాపత్రాల్లో చాలా తేడాలున్నాయని, ఈ పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై వారు గత నెలలో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఫలితాల విడుదలపై మధ్యంతర స్టే విధించింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తే సిబిఎస్‌ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఎస్‌ఈ పిటిషన్‌ను స్వీకరించిన మద్రాస్‌ హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఫలితాలపై స్టే ఇచ్చేందుకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సిబిఎస్‌ఈ నేడు ఫలితాలను విడుదల చేసింది.