నా కూతురు చామన్‌ ఛాయ కాని ప్రపంచంలోనే గొప్ప అందగత్తే

shanrukh khan, suhanna khan
shanrukh khan, suhanna khan

కోల్‌కోతా: పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ముద్దే ఈ విషయంలో ఎవరైనా కూడా మినహాయింపుకాదు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శరీర రంగును బట్టి మనిషి గుణగణాలను అంచనా వేయద్దంటున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. కోల్‌కోతాలో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడారు. శరీర రంగుపై ప్రస్తుతం ఎంతో వివక్ష జరుగుతుంది. నిజాయతీగా చెప్తున్నా నా కూతురు చామన ఛాయలో ఉంటుంది. కానీ ఆమె ప్రపంచంలోనే గొప్ప అందగత్తె. ఈ విషయంలో వేలెత్తి చూపించడానికి లేదుగ అని షారుక్‌ చెప్పుకొచ్చారు.