దేశ వ్యాప్తంగా యూరిన్ బ్యాంకుల ఏర్పాటుః నితిన్ గ‌డ్క‌రీ

Nitin gadkari
Nitin gadkari

ఢిల్లీః దేశంలో ఎరువుల కొరత తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఒక లీటర్ యూరిన్ కు రూపాయి చెల్లించి కొనుగోలు చేయనున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూరిన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సేకరించిన యూరిన్ తో యూరియాను తయారు చేయవచ్చని, ఇలా చేయడం ద్వారా యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా, అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని గడ్కరీ స్ప‌ష్టం చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తాలూకా, తహశీల్దార్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా మొట్టమొదట మహారాష్ట్రలోని నాగ్ పూర్ దగ్గర ఉన్న ధాప్ వడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా పది లీటర్ల యూరిన్ ను యూరిన్ బ్యాంక్ కు అందిస్తే..లీటర్ కు రూపాయి చొప్పున పది రూపాయలు వారికి అందజేస్తామని ఆయన తెలిపారు.