దేశ రాజధానిలో ఐటి దాడులు

it raids
it raids

రూ.25కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: ఐటిశాఖ నిర్వహించిన ఆకస్మికదాడుల్లో హవాలా కుంభకోణం బైటపడింది. రూ.25 కోట్లవరకూ నగదును ఐటి అధికారులు స్వాధీనంచేసుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో భారీ రాకెట్‌ను ఛేదించారు. చాందిని చౌక ఏరియాలో ఓప్రైవేటు సంస్థపై అధికారులు దాడిచేయడంతో హవాలా భాగోతం గుట్టరట్టయింది. అక్రమంగా నిర్వహిస్తున్న వందకుపైగా లాకర్లను తెరిపించారు. ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలుచేపట్టిన అధికారులు 25కోట్ల నగదును స్వాధీనంచేసుకున్నారు. పక్కాసమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెపుతున్నఐటి అధికారులు హవాలాతో అక్రమలావాదేవీలు నిర్వహించేవారు ఇలాంటి ప్రైవేటు లాకర్లలో నగదు నిల్వలు దాచిపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డసొమ్ము ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులదయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోసాగే ఈ దందాలో హావాలా బ్రోకర్లు పలువురికి సంబంధం ఉంటుందని అనుమానిస్తున్నారు. హవాలా మార్గంలో సొమ్ము రవాణాచేస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లుపొడుస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలురోజురోజుకీ పెరుగుతుండటంతో ఐటి అదికారులు విస్మయం వ్యక్తంచేస్నుతఆనరు. భారీ లాకర్‌ ఆపరేషన్లలో భాగంగా ఈ ఏడాదిలోనే ఇది మూడోసంఘటన కావడం గమనార్హం.