దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

sharad pawar
sharad pawar

న్యూఢిల్లీ: ఎల్జేడి నేత శరద్‌ యాదవ్‌ సిఎం చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు పార్లమెంట్‌ సాక్షిగా ఏపికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలానే అన్ని పక్షాలు ఏకమయ్యాయని గుర్తుచేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని శరద్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.