దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 8వ తరగతి వరకూ హిందీ ఉండాలి

PRAKASH JAVADEKAR
PRAKASH JAVADEKAR

న్యూఢిల్లీ:ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, పశ్చిమ్‌ బంగ, అసోం వంటి రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి అనే నిబంధన లేదు అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె.కస్తూరి రంగన్‌ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన సభ్యులతో ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీ ముసాయిదా నివేదికలో కీలక సూచనలు చేసింది. ఆంగ్లం, హిందీ సహా ప్రాంతీయ భాషతో కలిపి మొత్తం మూడు సబ్జెక్టులు అమలు చేయడానికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని కమిటీ సూచించింది. సామాన్య శాస్త్రం, గణితం వంటి సబ్జెక్టులకు ఏకరూప సిలబస్‌ ఉండొచ్చని సూచించింది.