దురంతోలో దుండగుల దోపిడి

duranto express
duranto express

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ నగరం పరిసరాల్లో దుండగులు ఈరోజు ఉదయం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడికి పాల్పడ్డారు. జమ్ము-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలు తెల్లవారుఝామున ఢిల్లీ శివారులోని బద్ది వద్ద ఆగింది. ఆ సమయంలో దాదాపు ఏడు నుంచి పది మంది దుండగులు రైల్లోకి ప్రవేశించి బి3, బి7 రెండు ఏసి భోగీల్లోకి వెళ్లి ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, ఫోన్లు, బంగారు నగలు లాక్కొని పారిపోయారు.