దత్తన్నకు గవర్నర్‌ పదవి?

B.Dattatreya
B.Dattatreya

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోది భావిస్తున్నారు. ఆ దిశగా జరుగుతున్న చర్చల్లో భాగంగా
దత్తాత్రేయకు ఉద్వాసన పలకనున్నారని సమాచారం. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దత్తాత్రేయతో భేటి అయ్యారు.
ఈ భేటీలో ఈ విషయాన్ని దత్తాత్రేయకు అమిత్‌షా స్పష్టం చేశారు. భేటీ అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, తనకు పార్టీ
గవర్నర్‌ పదవిని ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఇప్పటికే మంత్రి పదవులకు
పలువురు రాజీనామాలు చేశారు.