తిత్లీ బాధితులకు నిత్యావసరాల సరఫరా

TITLI TOOFAN IN ODISHA
TITLI TOOFAN IN ODISHA

భువనేశ్వర్‌: ఒడిశాలోని 16 జిల్లాలను తిత్లీ తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల వల్ల 57.08 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నట్లు సియం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ. 1000, 50 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్‌ను సరఫరా చేయాలని అధికారులను సియం ఆదేశించారు. మరో రూ. 2000 బాధితుల ఖాతాల్లోకి పంపాలని సూచించారు. తిత్లీ తుఫాను వల్ల 12 మంది మృతి చెందారు.