తమిళ నీట్‌ అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు

Madras High Court
Madras High Court

చెన్నై: జాతీయ ప్రవేశార్హత పరీక్ష(నీట్‌) తమిళ మాధ్యమంలో రాసిన వైద్య విద్య అభ్యర్థులకు అదనపు మార్కులు కలపాలని మాద్రాస్‌ హైకోర్టు కేంద్రీయ విద్యా మాధ్యమిక మండలి(సిబిఎస్‌ఈ)ని ఆదేశించింది. నీట్‌ తమిళ మాధ్యమంలో ప్రశ్నాపత్రలు తప్పులు దొర్లినందుకు ఈ గ్రేస్‌ మార్కులు కలపాలను న్యాయస్థానం స్పష్టం చేసింద. ఇటీవల నీట్‌ ఫలితాలు వెలువడిన విషయం విదితమే. ఐతే ఈ పరీక్షలో తమిళ భాషలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో 49ప్రశ్నల్లో తప్పుడు దొర్లాయని సిపిఎం నేత టికె రంగరాజ్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంగ్లీష్‌ నుంచి తమిళంలోకి అనువాదం చేసిన సమయంలో ఈ తప్పులు చోటు చేసుకున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలన కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే సిబిఎస్‌ఈ నీట్‌ ఫలితాలను వెల్లడించడం గమనార్హం.