తమిళనాడుకు రూ.2 లక్షలకోట్ల పెట్టుబడులు

tamilnadu
tamilnadu

చెన్నై: తమిళనాడు గ్లోబల్‌ఇన్వెస్టర్ల సదస్సుకు సంబంధించి రెండులక్షలకోట్ల ప్రతిపాదనలు వచ్చాయని ముఖ్యమంత్రి ఎడప్పాడికె పళనిస్వామి వెల్లడించారు. రెండోవిడత నిర్వమించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు భారీస్థాయిలో విజయం సాధించిందని, రెండులక్షలకోట్ల లక్ష్యానికి మించి పెట్టుబడుల ఒప్పందాలుజరిగాయన్నారు. జిఐఎం2019 రిజిస్ట్రేషన్లుసైతం తమ అంచనాలకు మించాయని అన్నారు. కొత్త పెట్టుబడుల ప్రణాళికలు ఇప్పటికీ వెల్లువలా వస్తున్నాయని, సదసుస నిర్వహణకు సమాయత్తం అవుతున్నప్పటినుంచే ఎక్కువ వచ్చాయన్నారు. పారిశ్రామికీకరణపరంగా తమిళనాడుకు ఎక్కువ ప్రాధాన్యతపెరిగిందని అన్నారు. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ రాష్ట్ర ఏరోస్పేస్‌, రక్షణరంగ పారిశ్రామిక విధాన పత్రాన్ని విడుదలచేసారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సత్వరమే విద్యుత్‌ వాహన ప్రణాళికలనుసైతం విడుదలచేస్తుందని, నగరాల్లో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెడుతున్నదని అన్నారు. కేంద్రమంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వపరంగా ఇన్వెస్టర్లకు రక్షణ, ఇతర రంగాల్లో పూర్తి మద్దతునిస్తుందని అన్నారు. ఏరోస్పేస్‌, రక్షణరంగంపరంగా మరింతప్రోత్సాహం ఉంటుందన్నారు. మొత్తం 250 ఎకరాల భూమిని శ్రీపెరుంబుదూరులో కేటాయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎంసి సంపత్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు సందర్భంగ ఆరాష్ట్రం సుమారు 2.42 లక్షలకోట్ల పెట్టుబడులు రాబట్టిందని, మొత్తం 98 ప్రాజెక్టులపరంగా వచ్చినట్లు వెల్లడించింద.ఇ వీటిలో 64వరకూ ముందస్తుకార్యాచరణతో నడుస్తున్నాయని అన్నారు.