ఢిల్లీ చేరుకున్న అమర్‌నాథ్‌ యాత్రికులు

న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో తెలుగు యాత్రికులు కొంతమంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఒకే కుటుంబానికి చెంది న 14 మంది యాత్రికులు బుధవారం న్యూఢిల్లీలోని ఏపి భవన్‌కు చేరుకున్నారు. ఏపి భవన్‌లో అధికారులు యాత్రీకులకు ప్రాథమిక సదుపాయాం కల్పించారు. యాత్రీకులందరినీ తమ స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కాశ్మీర్‌లో అల్లర్ల కారణంగా గత 5 రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాత్రీకులు మాట్లాడుతూ కాశ్మీర్‌లో  తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని మీడియాకు తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 20 వాహనాల్లో ఒకేసారి చాలా మందిని తరలించారని చెప్పారు. ఏలాగైతేనేం క్షేమంగా తాము ఢిల్లీకి చేరుకున్నామని, మిగతా వారిని కూడా క్షేమంగా తీసుకురావాలని కోరారు.