ఢిల్లీలో రైల్లో మహిళపై అత్యాచారం

rapeff
Rape

ఢిల్లీలో రైల్లో మహిళపై అత్యాచారం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై రైల్లో అత్యాచారం జరిగిన సంఘటన ఇది.. బీహార్‌కు చెందిన బాధితురాలు బంధువుల ఇంట ఒక కార్యక్రమానికి హాజరుకావడానికి రైలులో బయలు దేరింది.. ఆమె మహిళా బోగీలో ఎక్కింది. ఆమె ఎక్కేసమయంలో అయిదుగురు మహిళు కూడ ఉన్నారు. అయితే వాళ్లు తర్వాతి స్టేషన్‌లో దిగారు. ఫాహరాదా స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు అదేబోగీలో ప్రవేశించార. ఆమెపై దాడిచేసిన నగలు, నగదు దోచకున్నారు. ఆమెను కొట్టి అత్యాచారం చేశారు. రైలు ఓల్డ్‌ సిటీ చేరుకున్న తర్వాత రైల్వేపోలీసులు నిందితులను అరెస్టు చేశారు.